యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే

Apple electric car 3D model gives a sneak peek - Sakshi

2014 ప్రారంభం నుంచి యాపిల్ ఎలక్ట్రిక్ కారు విషయంలో అనేక పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్ వివరాల ఇప్పటికీ చాలా గోప్యంగా ఉన్నాయి. 9టూ5మ్యాక్ లో పేర్కొన్న నివేదిక ప్రకారం.. మేము 2024కు ముందు మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తుంది. కానీ, యుకె ఆధారిత వాహన లీజింగ్ కంపెనీ వనరామా యాపిల్ కారు ఎలా ఉండవచ్చో అని యాపిల్ పేటెంట్లను ఉపయోగించి ఒక 3డీ మోడల్ సృష్టించింది. 

ఈ 3డీ మోడల్ యాపిల్ ఎలక్ట్రిక్ కారు తుది డిజైన్ ఒక నమూనా అని మీరు గమనించాలి. కానీ, రాబోయే కొద్ది సంవత్సరాల్లో యాపిల్ అతిపెద్ద ఆవిష్కరణలలో ఇది ఒకటి అని మనం ఆశించవచ్చు. ప్రస్తుతానికి, వనరామ డిజైన్ చేసిన మోడల్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బయట నుంచి ఆపిల్ కారు రెండర్ టెస్లా సైబర్ ట్రక్‌ను కొంతవరకు పోలి ఉంటుంది. కానీ ఇది సైబర్ ట్రక్ కంటే కొంచెం చిన్నగా ఉంది.

ఈ కారు పిల్లర్ లెస్ నిర్మాణాన్ని కలిగి ఉంది. పేటెంట్ ప్రకారం 10309132బి1 విండ్ షీల్డ్, కిటికీలు, సన్ రూఫ్ కలిగి ఉంది. దీనిలో అడాప్టివ్ డోర్లు, కారు ముందు భాగంలో మాక్ ప్రో మెష్ గ్రిల్ ఉంది. కారు రిట్రాక్టబుల్ డోర్ హ్యాండిల్స్ ఐఫోన్ సైడ్ బటన్లను పోలి ఉంటాయి.

ఇవి ఏ పేటెంట్ల ఆధారంగా లేనప్పటికీ, వనరామా కూడా దీనిని నాజూకైన ఎస్యువిలా కనిపించేలా చేసింది. ఐఫోన్ 4 ఫ్రోస్టెడ్ వైట్ ఫినిష్ ఇచ్చింది. కారు లోపల మ్యాక్ ఆటోమేటెడ్ అసిస్టెంట్, సీరి(పేటెంట్ ప్రకారం జెపి2020173835ఎ) ఉంది. 

(చదవండి: అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్‌.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top