ఆకాష్‌ అంబానీతో యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ భేటీ.. కారణం అదేనా?

Apple Ceo Tim Cook Meets Akash Ambani At Antilia Residence Ahead Of The Retail Store Launch - Sakshi

భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ ప్రారంభమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘యాపిల్‌ బీకేసీ’ (Apple BKC) పేరిట ఏర్పాటైన ఈ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.

ఈ స్టోర్‌ ప్రారంభోత్సవానికి ముందు రోజు అంటే ఏప్రిల్‌ 17న టిమ్‌కుక్‌ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్‌ రుచి చూడడం నుంచి దేశంలో ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్‌లను కలిసినట్లు తెలుస్తోంది. 

 

ఇక దేశీయంగా యాపిల్‌ వ్యాపార వ్యవహారాల నిమిత్తం కుక్‌ ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, ముంబై అల్టామౌంట్ రోడ్‌లోని ముఖేష్‌ అంబానీ నివాసం ఆంటిలియాకు వెళ్లారు. అక్కడ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీని కలిశారు. ఆ తర్వాత టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారని విశ్వసనీయ సమాచారం.

ఆ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి ముంబై వీధుల్లో టిమ్‌కుక్‌ సందడి చేశారు. ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ అమితంగా ఇష్టపడే ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో మాధురీ దీక్షిత్‌తో కలిసి  వడపావ్‌ (అంబానీల సూచన మేరకు) ఆరగించారు. 

దీనికి సంబంధించిన ఫోటోను మాధురి దీక్షిత్ ట్వీట్ చేశారు. ముంబైలో వడా పావ్ కంటే మెరుగైన స్వాగతం మరొకటి ఉండదు అంటూ పోస్ట్ చేశారు. దీనికి టిమ్‌ కుక్‌ 'నాకు మొదటిసారి వడ పావ్‌ని  పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది చాలా రుచిగా ఉంది’అంటూ టిమ్ కుక్ బదులిచ్చారు.

చదవండి👉భారత్‌లో తొలి యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌.. ప్రారంభించిన టిమ్‌కుక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top