పీఎన్‌బీ స్కాం: చోక్సీకి భారీ షాక్‌

Antigua revokes citizenship of Mehul Choksi - Sakshi

మెహుల్ చోక్సీ  ఆంటిగ్వా  పౌరసత్వం రద్దు

భారత్‌కు అప్పగించే చర్యలు త్వరలో ప్రారంభం

ఇప్పటికే నీరవ్‌మోడీ విషయంలో లండన్‌ కోర్టు కీలక తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌నేషనల్‌  బ్యాంకు కుంభకోణం (పీఎన్‌బీ స్కాం)లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, నీరవ్‌మోదీ మేనమామ,  డైమండ్‌ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ షాక్‌ తగిలింది. వేలకోట్ల రూపాయల మేర పీఎన్‌బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా రద్దు చేసింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం.  

గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్‌లో‌ని సివిల్ కోర్టును ఆశ్రయించాడు.  చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో, చోక్సీ పిటిషన్‌ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్‌కు అప్పగించే  చర్యలు  త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. కాగా దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనేఅంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని  2019 జూన్‌లో స్పష్టం చేశారు. మరోవైపు  ఇప్పటికే పీఎన్‌బీ స్కాంకు సంబంధించి లండన్‌ కోర్టు  తీర్పు అనంతరం, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధ మవుతున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top