అద్భుతమైన బిజినెస్‌ మంత్రం చెప్పిన ఆనంద్‌ మహీంద్రా | Anand Mahindra Told About Team Work | Sakshi
Sakshi News home page

అద్భుతమైన బిజినెస్‌ మంత్రం చెప్పిన ఆనంద్‌ మహీంద్రా

Mar 28 2022 12:26 PM | Updated on Mar 28 2022 1:15 PM

Anand Mahindra Told About Team Work - Sakshi


వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్‌ మహీంద్రా. దేశం నలుమూలలా దాగిన ప్రతిభను ప్రోత్సహించడం. భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా నిలిచే అంశాలను పంచుకోవడంతో పాటు అప్పుడప్పుడు మంచి బిజినేస్‌ పాఠాలను కూడా చెబుతుంటారు. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు కానీ.. సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌ నుంచి ఆ సలహా వచ్చినప్పుడు దాని రేంజ్‌ వేరే లెవల్‌లో ఉంటుంది. 

తాజాగా టీమ్‌ వర్క్‌కి సంబంధించిన ఐడియాను ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోను ఉదహరిస్తూ నెటిజన్లతో పంచుకున్నారు. ఓ పార్కింగ్‌ స్లాట్‌లో ఒక చిన్న తినుబండరం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి. అప్పటికే తినుబండం పిల్లి నోటికి అందేంత దూరంలో ఉంటుంది. అయితే రెండు కాకులు ఒక టీమ్‌గా పని చేస్తూ ఆ తినుబండరాన్ని తమ కంటే బలవంతమైన పిల్లి దగ్గర నుంచి తీసుకుంటాయి. 

ఒక పిల్లి, రెండు కాకులకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా... మీరు కనుక టీమ్‌ వర్క్‌ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారంటూ తేల్చి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement