అమితాబ్‌ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్‌.. రెంట్‌ వింటే షాకవుతారు?

Amitabh Bachchan Rents Andheri Duplex Flat To Kriti Sanon - Sakshi

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో అద్దెకు దిగింది పరమ్‌ సుందరీ కృతి సనన్‌. ముంబై సౌత్‌ అంధేరిలో ఇటీవల కొనుగోలు చేసిన డుప్లెక్స్‌ ప్లాటును అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు అమితాబ్‌. బిగ్‌ బి నిర్ణయం వెలువడటం ఆలస్యం అనేక మంది సెలబ్రిటీలు ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు కృతి సనన్‌కి దక్కింది.

అద్దె ఎంత ?
బిగ్‌ బి తన డూప్లెక్స్‌ ప్లాట్‌కి అద్దెగా నెలకు రూ. 10 లక్షలు రూపాయలు తీసుకుంటున్నారు. దీనికి సెక్యూరిటీ డిపాజిట్‌గా ఇప్పటికే కృతి సనన్‌ రూ. 60 లక్షలు చెల్లించింది. వీరి మధ్య కుదిరిన అగ్రిమెంట్‌ ప్రకారం 2021 అక్టోబరు 16 నుంచి 2023 అక్టోబరు 15 వరకు ఈ ఇల్లు కృతి సనన్‌ ఆధీనంలో ఉంటుంది.

27వ అంతస్తులో
అంధేరిలోని లోకండ్‌వాలా రోడ్డులో ఉన్న అట్లాంటిస్‌ బిల్డింగ్‌లో 27, 28వ అంతస్థులో అమితాబ్‌ ఇల్లు ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 5,184 చదరపు అడుగులు. ఈ ఇంటిని 2020 డిసెంబరులో అమితాబ్‌ రూ. 31 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. 2021 ఏప్రిల్‌లో ఇంటిని ఆయన హాండోవర్‌ చేసుకున్నారు. 

అద్దెకు మరిన్ని
బాలీవుడ్‌లో మొట్టమొదటి యాంగ్రీయంగ్‌ మ్యాన్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న అమితాబ్‌కి ముంబైలో అనేక ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో జూహూలో ఉన్న వత్స, అమ్ము అనే బంగ్లాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అద్దెకు ఇచ్చారు అమితాబ్‌. వీటి నుంచి నెలకు రూ. 18.90 లక్షల అద్దెను పొందుతున్నారు అమితాబ్‌. ఈ అగ్రిమెంట్‌ పదిహేనేళ్ల కాలానికి ఉంది. 

సన్ని లియోన్‌ కూడా
వెస్ట్‌ అంధేరిలో ఉన్న అట్లాంటిస్‌ బిల్డింగ్స్‌లో నివసించేందుకు సెలబ్రిటీలు మక్కువ చూపుతున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన అట్లాంటిస్‌లో కేవలం 24 అపార్ట్‌మెంట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో సెలబ్రిటీలకు కావాల్సినంత ‘స్పేస్‌’ లభిస్తుంది. అందువల్లే ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అట్లాంటిస్‌లో మరో బ్యూటీ సన్ని లియోన్‌ సైతం 12వ అంతస్థులో ఓ అపార్ట్‌మెంట్‌ని రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. 
 

చదవండి: బ్రాండ్‌ కా బాప్‌.. అమితాబ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top