ఓటీటీ ప్రియులకు ఇక పండగే!

Amazon launches Prime Video Channels in India - Sakshi

ఓటీటీలో మూవీస్ చూసేవారికి పండుగ లాంటి వార్తా అమెజాన్ ప్రైమ్ చెప్పింది. భారతదేశంలో అమెజాన్ తన వ్యూహాత్మక చర్యలలో భాగంగా ప్రైమ్ వీడియో ఛానల్స్ ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఎనిమిది సబ్ స్క్రిప్షన్ ఆధారిత ఒటీటీ యాప్స్ ప్రత్యేక కంటెంట్ ని ఇక నుంచి సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిపింది. డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకూబాయ్, ఇరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమా మ్యాక్స్, షార్ట్స్ టివి వంటి స్ట్రీమింగ్ యాప్స్ కంటెంట్‌ని యాడ్ ఆన్ సబ్ స్క్రిప్షన్లతో ప్రైమ్ వీడియో సభ్యులు యాక్సెస్ చేసుకోవచ్చు. 

ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన ఈ అన్ని యాప్స్ కొరకు సింగిల్ బిల్లింగ్ మెకానిజం ఉంటుంది. ప్రైమ్ వీడియో ఛానల్స్ నేటి (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభమవుతాయి. ప్రైమ్ వీడియో ఛానల్స్ ద్వారా డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకుబే, ఎరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమాక్స్, షార్ట్స్ టివి వంటి ఎనిమిది వీడియో స్ట్రీమింగ్ యాప్స్ వేలాది షోలు, మూవీలు, రియాలిటీ టివి, డాక్యుమెంటరీలు మొదలైన వాటితో సహా గ్లోబల్, లోకల్ బింగే-వర్తీ కంటెంట్ ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అయితే, కస్టమర్లు తాము ఎంచుకున్న సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించవచ్చు. ఈ ఎనిమిది ఒటీటీ ప్లాట్ ఫారమ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది గనుక, వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను చూడటానికి ఇక ఈ ఎనిమిది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, అన్నీ ఛానెల్స్ మధ్య సులభంగా స్విచ్ అవ్వవచ్చు.

ప్రైమ్ వీడియో ఛానల్స్ ఓటిటి యాప్స్ సబ్ స్క్రిప్షన్ ధర

  • డిస్కవరీ+ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299
  • డోకుబే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.499 
  • ఇరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ ధర రూ.299
  • హోయిచోయ్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.599 
  • లయన్స్ గేట్ ప్లే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699
  • మనోరమాక్స్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699 
  • ఎంయుబిఐ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.1999
  • షార్ట్స్ టీవీ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top