అమెజాన్‌ స్మాల్‌ బిజినెస్‌ డేస్‌.. ఎప్పుడంటే?

Amazon India Announces Small Business Days: Details Here - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్ ఇండియా జూలై 2–4 తేదీల్లో స్మాల్‌ బిజినెస్‌ డేస్‌ను నిర్వహిస్తోంది. కోవిడ్‌–19 కారణంగా వ్యాపారాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో.. వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ సేల్‌ను చేపడుతున్నట్టు వెల్లడించింది. జూలై 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై.. జూలై 4వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు స్మాల్‌ బిజినెస్‌ డేస్‌ కొనసాగుతాయని తెలిపింది.

లక్షలాది తయారీదారులు, చిన్న బ్రాండ్స్‌ యజమానులు, 1,000కిపైగా స్టార్టప్స్, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షలపైచిలుకు చేతివృత్తులవారు, చేనేతకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఇందులో పాలుపంచుకుంటారని కంపెనీ వివరించింది.

చదవండి: 
డీమోనిటైజేషన్‌: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు

అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్‌గేట్స్‌ మాత్రం కాదు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top