అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్

AJIO Big Bold Sale: Luxury fashion brands come together for a mega sale - Sakshi

ట్రెండ్స్‌, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఈ-రిటెయిలర్‌ అజియో జూలై 1, 2021 నుంచి జూలై 5, 2021 వరకు ఫ్యాషన్‌ శ్రేణి అమ్మకం బిగ్‌ బోల్డ్‌ సేల్‌ నిర్వహిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్‌ సేల్‌. 2500పైగా బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దేశంలోని ప్రతీ కస్టమర్‌ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్‌ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ అందిస్తోంది. 

ప్రపంచ ఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్‌, లివైస్‌, యూనైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌కు చెందిన స్టైల్స్‌ అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ మెగా ఈవెంట్‌ ద్వారా ఫ్యాషన్‌ ప్రపంచపు సుందరి సోనమ్‌ కపూర్‌, ఫ్యాషన్‌ ఐకాన్స్‌ గురు రణధావ, శృతి హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌, మౌనీ రాయ్‌ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్‌ శ్రేణులైన టీ-షర్ట్స్‌, జీన్స్‌, కుర్తాలు, స్నీకర్స్‌పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫ్‌ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు.

ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్‌ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది. దేశంలోని ఫ్యాషన్‌ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో, స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్‌ అందిస్తోంది.

చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top