ఎయిర్‌టెల్, టెక్‌ మహీంద్రా జట్టు | Airtel, Tech Mahindra team up for digital solutions across 5G network | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్, టెక్‌ మహీంద్రా జట్టు

Published Fri, Apr 1 2022 4:14 AM | Last Updated on Fri, Apr 1 2022 4:14 AM

Airtel, Tech Mahindra team up for digital solutions across 5G network - Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లు, క్లౌడ్‌ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్‌ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్‌ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌టెల్‌ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్‌ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement