ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. ఎయిర్‌టెల్‌, జియో లేటెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు ఇవే! | Sakshi
Sakshi News home page

ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. ఎయిర్‌టెల్‌, జియో లేటెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు ఇవే!

Published Tue, Nov 28 2023 5:07 PM

Airtel, Jio Offer Prepaid Plan With Free Netflix Subscription - Sakshi

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా ప్రీపెయిడ్‌ ప్లాన్‌ బండిల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.. ఈ ఏడాది ప్రారంభంలో జియో సైతం ఈ తరహా రీఛార్జ్‌ ప్లాన్‌లను యూజర్లకు అందించగా.. ఎయిర్‌టెల్‌  తాజాగా సబ్‌స్క్రిప్షన్‌ బండిల్స్‌ను ప్రారంభించింది. 

ఎయిర్‌టెల్‌, జియోలు దేశంలో 5జీ సేవల్ని అందిస్తున్నాయి. అయితే కస్టమర్ల కోసం ఈ రెండు సంస్థలు కలిసి నెట్‌ఫ్లిక్స్‌ బండిల్స్‌తో పాటు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాను అందిస్తుండగా.. వాటిల్లో నెట్‌ఫ్లిక్స్‌ని ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించాయి.  

ఇక ఎయిర్‌టెల్‌ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ల విషయానికొస్తే..84 రోజుల వ్యాలిడిటీతో రూ.1499 విలువైన ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను అందిస్తుంది. 5జీ సేవలున్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న ప్లాన్‌ను ఉపయోగిస్తే 5జీ కంటే ఎక్కువ డేటా పొందవచ్చు.  

కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో బేసిక్‌ నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ సైతం వినియోగించుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్లెట్‌, టీవీ ఇలా ఏదైనా ఒక డివైజ్‌లో ఓటీటీ సేవల్ని పొందొచ్చు. ఉచితంగా ఎయిర్‌టెల్‌ హలోట్యూన్స్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. 

మరోవైపు జియో అందిస్తున్న రెండు ప్లాన్‌లలో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ వీక్షించవచ్చు. అందులో ఒక ప్లాన్‌ ఖరీదు రూ.1,099 ఉండగా ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. మరో ప్లాన్‌ రూ.1,499లో ప్రతి రోజు 3జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. 

ఈ రెండు జియో ప్లాన్‌లలో ముందుగా చర్చించిన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ ప్లాన్ మాదిరిగానే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఒక్కొక్కటి 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. జియో ప్లాన్‌లు రోజువారీ డేటా ప్యాక్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది. 

Advertisement
Advertisement