డాట్‌కాం టాట్‌ఇన్‌లు ఓల్డ్‌ కొత్తగా డాట్‌భా

Agaamin Introduce Indian internet domain with TDL name .bha - Sakshi

అందుబాటులోకి ‘డాట్‌భా’ డొమైన్‌   

ముంబై: డాట్‌కామ్, డాట్‌ఇన్‌ మొదలైన ఇంటర్నెట్‌ డొమైన్స్‌ స్థానంలో తాజాగా భారత్‌ను ప్రతిబింబించేలా డాట్‌భా (.bha) పేరిట డొమైన్‌ను స్టార్టప్‌ సంస్థ ఆగామిన్‌ టెక్నాలజీస్‌ ఆవిష్కరించింది. ఇండియా (పట్టణ ప్రాంతాలు), భారత్‌ (గ్రామీణ ప్రాంతాలు) మధ్య డిజిటల్‌ తారతమ్యాలను చెరిపివేసే దిశగా ఈ ప్రయత్నం తోడ్పడగలదని సంస్థ వ్యవస్థాపకుడు సజన్‌ నాయర్‌ తెలిపారు.

త్వరలో తెలుగులో
హిందీతో ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ తదితర ప్రాంతీయ భాషల్లోనూ టాప్‌ లెవెల్‌ డొమైన్స్‌ (టీఎల్‌డీ)ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి బెంగాలీ, ఏప్రిల్‌లో మలయాళం, మే నెలలో ఉర్దూ వెర్షన్‌లలో వీటిని ఆవిష్కరించనున్నట్లు నాయర్‌ వివరించారు. ఇమోజీలు, ఇంటిపేర్లతో కూడా టీఎల్‌డీలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వెబ్‌సైట్‌లో పేరు, టీఎల్‌డీ కలిసి ఉంటాయి. ఉదాహరణకు గూగుల్‌ డాట్‌ కామ్‌ తీసుకుంటే, గూగుల్‌ అనేది సంస్థ పేరు కాగా, డాట్‌కామ్‌ అనేది టీఎల్‌డీగా వ్యవహరిస్తారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top