5G Auction: సై అంటై సై.. రెండో రోజు బిడ్లు@ రూ.1.49 లక్షల కోట్లు

5G Auction: Govt Receives Second Day Bids On High Amount Over 1 Lakh Crore - Sakshi

మూడోరోజూ కొనసాగనున్న 5జీ వేలం

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రంను కేటాయించేందుకు నిర్వహిస్తున్న వేలంలో టెల్కోలు గట్టిగా పోటీపడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి.

తొలి రోజున నాలుగు రౌండ్లు నిర్వహించగా, టెల్కోలు రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లను దాఖలు చేశాయి. రెండో రోజైన బుధవారం మరో అయిదు రౌండ్లు జరిగాయి. వేలం ప్రక్రియ మూడో రోజున (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

చదవండి: America Federal Reserve Bank: ప్చ్‌.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top