
యూట్యూబ్.. దాదాపు ప్రతిఒక్కరు రోజులో కనీసం ఒకసారైనా ఈ యాప్ ఓపెన్ చేస్తారు. ఇంటర్‌నెట్‌పై పూర్తి అవగాహన లేనిరోజుల్లో అసలు వీడియోల ద్వారా కంటెంట్‌ను అందించాలనే ఆలోచన పుట్టడమే అప్పట్లో గొప్ప విషయం. ఆ ఆలోచనలో నుంచి పుట్టిన యూట్యూబ్ ప్రస్తుతం కోట్లమంది కంటెంట్ క్రియేటర్లకు జీవనాధారంగా మారుతోంది. వయసు భేదం లేకుండా కొత్త విషయాలు తెలుసుకునే వారికి దిక్సూచిగా ఉంటోంది. తమ ఉత్పత్తులు ప్రమోట్ చేయాలనుకునేవారికి సహాయపడుతోంది. అలాంటి యూట్యూబ్ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.




