అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..

27 Percent Of Homebuyers Are Getting Younger, Millennials Opting For Home Loans - Sakshi

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా..అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. అపార్ట్‌మెంట్‌ కట్టాలన్నా లేక ఇండిపెండెంట్‌ హౌస్‌ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. 

ధరలను నియంత్రించేందుకు గాను ఆర్‌బీఐ రెపోరేట్లు.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినప్పటికీ మిలియనిల్స్‌ (1980 తర్వాత జన్మించిన వాళ్లు) సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి

దేశంలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోళ్లు ప్రభావం చూపుతుందా? మిలియనిల్స్‌ ఏమనుకుంటున్నారు? అన్న అంశంపై ప్రముఖ రియాల్టీ సంస్థ నోబ్రోకర్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ నగరాల నుంచి సుమారు ఇంటి లోన్‌ తీసుకున్న 2 వేల మంది పాల్గొన్నారు. 

ఇక, ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. 2022 అక్టోబర్‌  - డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి  - మార్చి మధ్య కాలంలో వడ్డీ రేట్లు ఆకాన్నంటుతున్నా.. 42 శాతం హోం లోన్‌ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ముగిసిన ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ 1, 2022 నుంచి మార్చి 31, 2021 సమయంలో ఇళ్ల లోన్ల వృద్ధి 120 శాతం పెరిగింది. 

కోవిడ్‌-19 తెచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ‘మనకీ ఓ సొంతిల్లు’ ఉంటే బాగుండేదన్న ఆలోచన పెరిగింది. కాబట్టే కోవిడ్‌-19కి ముందు మిలియనిల్స్‌ 17శాతం ఉంటే ఇప్పుడు అదికాస్త 27కి పెరిగింది. వారిలో ఎక్కువ మంది 25 - 35 మధ్య వయస్కులే ఉండటం గమనార్హం.

36 ఏళ్ల వయసు దాటిన తర్వాత గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ‘లేట్ మిలీనియల్స్’ నిలుస్తున్నారు. వీళ్లు సైతం ఇల్లు కొనుగోలు చేసే వారి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే హైలెట్‌ చేసింది. 

సొంతింటి కోసం ఎక్కువ మంది కుర్రకారు 10 శాతం డౌన్‌ పేమెంట్‌ కోసం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌(ఎన్‌బీఐఎఫ్‌సీ) వంటి సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో పర్సనల్‌ లోన్‌ తీసుకొని వాటి ద్వారా డౌన్‌ పేమెంట్‌ చెల్లిస్తున్నారు.

78 శాతం మంది హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం లేదు.. అలా అని తక్కువగా ఉన్నాయని చెప్పడం లేదని తేలింది

రుణాలపై ఇళ్లను కొనుగోలు చేసేవారు ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు.. ఆ భారం వల్ల ఎదుర‍్కొన్నే కష్ట - నష్టాలను  పూర్తిగా అర్ధం చేసుకున్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు 6 నుంచి 8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు.

‘ఇళ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్‌ కలిగి ఉంటాయి. మేము ఈ 20 సంవత్సరాల టెన్యూర్‌ కాలంలో రెపో రేట్ పెంపు, తదుపరి రేటు తగ్గింపు సాధారణంగా సగటున ఉన్నట్లు స్పష్టమవుతుంది’ అని నోబ్రోకర్‌ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు.

మిలీనియల్స్ కోసం నిర్వహించిన ప్రత్యేక నోబ్రోకర్‌ అధ్యయనంలో కొవిడ్‌కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్‌ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని నో బ్రోకర్‌ సర్వేలో తేలింది.

చదవండి👉 ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top