Flipkart Big Saving Days Sale: ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!

Flipkart Big Saving Days Sale Starts From May 5, Get Up To 80 Percent Discount - Sakshi

మే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో బట్టలు, స్మార్ట్‌ ఫోన్‌లు ఇతర గృహోపరకరణాలు కొనుగోలు చేయాలని అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ ఈ - కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ కొనుగోలు దారులకు అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే 5 నుంచి మే 10 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 

ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డే సేల్స్‌ 
ఆరు రోజుల పాటు జరిగే ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డే సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్‌, బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్లను పొందవచ్చు. అదే సమయంలో నిర్వహించే క్రేజీ డీల్స్‌, బెస్ట్‌ ప్రైస్‌ వంటి డీల్స్‌లో ఆకర్షణీయమైన డిస‍్కౌంట్లు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. 

80శాతం వరకు డిస్కౌంట్స్‌
ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 80 శాతం, గ్రూమింగ్‌, స్టైలిష్‌ ప్రొడక్ట్‌లపై ఆఫర్లు, మైక్రో ఎస్‌డీ కార్డ్స్‌, పెన్‌ డ్రైవ్స్‌, హార్డ్‌ డ్రైవ్‌లపై 60 శాతం డిస్కౌంట్‌, టీవీలు, ఉపకరణాలపై 75 శాతం, రిఫ్రిజిరేటర్లు,వాషింగ్‌ మెషీన్లపై 55 శాతం, గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.ప్లిప్‌కార్ట్‌ సొంతం ప్రొడక్టులైన ఫ్యాషన్‌, బ్యూటీ,ఫుడ్‌, స్పోర్ట్స్‌ ప్రొడక్ట్‌, హోమ్‌, కిచెన్‌లో వినియోగించే వస్తువులపై 80శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీ
ఈ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు మే 4న డీల్స్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 20వేల విలువైన సూపర్‌కాయిన్స్, రివార్డ్‌ల కంటే నాలుగు రెట్లు సంపాదించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీలో వస్తువులు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

చదవండి👉 మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్‌ కాల్స్‌ నిబంధనలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top