ఎగుమతుల్లో రికార్డ్ సృష్టించనున్న వాల్‌మార్ట్ - 2027 నాటికి..

By 2027 walmart is doing 10 billion in annual exports - Sakshi

న్యూఢిల్లీ: దేశం నుంచి 2027 నాటికి ఏటా 10 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను వాల్‌మార్ట్‌ ఎగుమతి చేయడంలో సహాయపడటానికి అపూర్వ సరఫరాదారుల వ్యవస్థ దోహదం చేస్తుందని రిటైల్‌ వాల్‌మార్ట్‌ తెలిపింది. భారతీయ సంఘాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, స్థానిక వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడానికి, దేశం నుండి ప్రపంచానికి రిటైల్‌ కోసం పరివర్తన, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించాలన్న సంస్థ ప్రణాళికను వాల్‌మార్ట్‌ ప్రెసిడెంట్, సీఈవో డాగ్‌ మెక్‌మిలన్‌ పునరుద్ఘాటించారు. 

భారతీయ సరఫరాదారులు, భాగస్వాములను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘వాల్‌మార్ట్‌ భారతదేశానికి కట్టుబడి ఉంది. దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు, సభ్యుల కోసం నాణ్యమైన, సరసమైన, స్థిర ఉత్పత్తులను తయారు చేసే భారతీయ సరఫరాదారులు, భాగస్వాముల గురించి మేము సంతోషిస్తున్నాము. ఉద్యోగాలను సృష్టించడం, సంఘాలను బలోపేతం చేయడం, తయారీ కేంద్రంగా భారత పురోగతిని వేగవంతం చేయడం ద్వారా మా వ్యాపారం దేశ వృద్ధికి తోడ్పడగలదని గర్విస్తున్నాము’ అని వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top