వారెవా! ఏముంది బైక్

2021 Honda Gold Wing Tour Cost 37 lakh Above in India - Sakshi

చూసీచూడగానే 'వారెవా' అనిపించేలా ఉంది హోండా మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా వారి గోల్డ్‌వింగ్‌ టూర్‌. గత నెల విడుదల చేసిన ఈ బైక్ ఎయిర్ బ్యాగ్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (డీసీటి) అనే రెండు వేరియెంట్లలో లభ్యం అవుతుంది. 'కంఫర్డ్‌, లగ్జరీ టాప్‌ ఫీచర్లతో రూపుదిద్దుకున్న గోల్డ్‌వింగ్‌కు మంచి స్పందన వస్తుంది” అని కంపెనీ చెబుతుంది. ఈ బైక్ ధర ఎంతో తెలుస్తే! మీరు ఒకింత షాక్ అవుతారు. మాన్యూవల్ ట్రాన్స్ మిషన్ బైక్ ధర రూ.37,20,342గా ఉంటే, డీసీటి + ఎయిర్ బ్యాగ్ ధర వచ్చేసి రూ.39,16,055 (ఎక్స్ షో రూమ్, హర్యానా)గా ఉంది.

1,833 సీసీ ఇంజిన్
ఈ గోల్డ్ వింగ్ 1833సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ 24-వాల్వ్ ఎస్ వోహెచ్ సీ ఫ్లాట్-6 ఇంజిన్ తో వస్తుంది. ఇది 5,500 ఆర్ పీఎమ్ వద్ద 124.7 హెచ్ పీ, 170 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో బ్లూటూత్‌ కనెక్టివిటీ కూడా వస్తుంది. అలాగే, 7-స్పీడ్‌ డ్యూయెల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆష్షన్‌(డీసీటి) విత్ ఎయిర్‌ బ్యాగ్‌ ఆప్షన్ కూడా ఉంది. 2021 గోల్డ్ వింగ్ హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ (హెచ్ ఎస్ టీసీ)తో వస్తుంది, ఇది విభిన్న రైడింగ్ పరిస్థితుల్లో రియర్ వీల్ ట్రాక్షన్ మానిటర్ చేయడానికి సహాయపడుతుంది. ఇతర ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్(ఐఎస్ జి), ఐడ్లింగ్ స్టాప్(డిసిటి ఆప్షన్ పై), మాన్యువల్-డిసిటి వేరియెంట్లపై హిల్ స్టార్ట్ అసిస్ట్(హెచ్ఎస్ ఎ) ఉన్నాయి.

దీనిలోని ఏడు అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్ టి లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే స్క్రీన్ ఆడియో, నావిగేషన్ సిస్టమ్ల మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. 2021 గోల్డ్ వింగ్ స్మార్ట్ కీ మోటార్ సైకిల్ యొక్క అన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేస్తుంది. ఇగ్నీషన్, హ్యాండిల్ బార్ లాక్ ని కేవలం తీసుకెళ్లేటప్పుడు ఆన్/ఆఫ్ చేయవచ్చు. దీనిలో అప్ గ్రేడ్ చేసిన లైట్ వెయిట్ స్పీకర్లు ఉన్నాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 21.1 లీటర్లు. గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ), హైదరాబాద్ (తెలంగాణ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్ షిప్లలో హోండా 2021 గోల్డ్ వింగ్ టూర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top