ఈఎస్‌ఐ కిందకు 18.88 లక్షల మంది కొత్త సభ్యులు

18.88 Lakh New Workers Enrolled Under Esi Scheme - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే ఈఎస్‌ఐ పథకం కిందకు సెప్టెంబర్‌ నెలలో కొత్తగా 18.88 లక్షల మంది సభ్యులు భాగస్వాములు అయ్యారు. 22,544 సంస్థలు మొదటిసారి ఈఎస్‌ఐసీ కింద నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్‌ఐ కవరేజీ వర్తించనుంది.

కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల్లో 9.06 లక్షల మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో 47.98 శాతానికి ఇది సమానం. కొత్త సభ్యుల్లో మహిళలు 3.51 లక్షల మంది ఉన్నారు. అలాగే 61 మంది ట్రాన్స్‌జెండర్‌ విభాగానికి చెందిన వారు కూడా ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top