అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

చుంచుపల్లి: అభివృద్ధి పనులు సాఫీగా సాగేలా అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన 22 మండలాల పర్యవేక్షకులతో సమావేశమైన ఆమె పలు అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులను అభివృద్ధి పనులకు వినియోగిస్తూ, రిజిస్టర్లలో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. అలాగే, ప్రజావాణిలో అందే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వమించాలని తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఈఓ బి.అప్పారావు ఆడిట్‌ అభ్యంతరాలపై సమీక్షించగా, సూపరింటెండెంట్లు వీబీవీకే.ప్రసాద్‌, బి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీమాతో కుటుంబాలకు భద్రత

ములకలపల్లి: కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితిలో కన్నుమూస్తే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంతోపాటు చౌటిగూడెంలో బీమా దరఖాస్తుల నమోదు కేంద్రాలను శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. అనంతరం ములకలపల్లి గ్రామసమాఖ్య వద్ద మరుగుదొడ్లు, చౌటిగూడెం, రంగాపురంల్లో ఇంకుడుగుంతల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ రమేష్‌బాబు, ఈజీఎస్‌ ఏపీఓ హుస్సేన్‌, హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌, జీపీ కార్యదర్శు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement