అయ్యప్ప మహా పడిపూజ, అగ్నిగుండం | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మహా పడిపూజ, అగ్నిగుండం

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

టేకులపల్లి: టేకులపల్లి మండలం తావుర్యాతండాలో శుక్రవారం రాత్రి గురుస్వామి మంగీలాల్‌ ఆధ్వర్యాన అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. తొలుత గ్రామ పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వమించగా పెద్దసంఖ్యలో మాలధారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని పడిపూజ నిర్వహించారు. ఆ తర్వాత అగ్నిగుండంలో నడిచారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాలధారులు పెద్దసంఖ్యలో పాల్గొనగా అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది.

‘కై ్లమేట్‌ కాంక్లేవ్‌’లో

జిల్లా వాసులు

చుంచుపల్లి: హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘తెలంగాణ కై ్లమేట్‌ కాంక్లేవ్‌–2026’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వన సంరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నా రు. అన్నపురెడ్డిపల్లి వన సంరక్షణ సమితికి చెందిన చెదురుపల్లి రాములు, పూనెం వీరస్వామి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై చర్చించడమే కాక అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వన సంరక్షణ సమితుల పాత్రను వివరించారు.

మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

అశ్వారావుపేటరూరల్‌: ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ చదవిన విద్యార్థి ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని అచ్యుతాపురానికి చెందిన బుల్లిపల్లి జస్వంత్‌ వర్మ(23) ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేయగా కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈక్రమాన గురువారం రాత్రి ఆయన ఇంట్లోని ఓ గదిలో ఉరి వేసుకున్నాడు. శుక్రవారం తెల్లారాక కుటుంబీకులు గమనించగా, ఘటనపై జస్వంత్‌ తండ్రి విజయ సత్యరామరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై దేవ్‌సింగ్‌ తెలిపారు. కాగా, ఏకై క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, కుటుంబీకులుకన్నీరుమున్నీరుగా విలపించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో

పశు వైద్య వాహనం దగ్ధం

మణుగూరు టౌన్‌: పశు వైద్య సంచార వాహనంలో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడడంతో దగ్ధమైంది. మండలంలోని సాంబాయిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణకు శుక్రవారం సిబ్బంది వెళ్తుండగా బ్రేక్‌డౌన్‌ కావడంతో పక్కకు పెట్టారు. కాసేపటికి బ్యాటరీల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు మొదలై వాహ నం కాలిపోయింది. ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించగా, బీటీపీఎస్‌ ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఉద్యమకారులకు

పెన్షన్‌ ప్రకటించకపోతే ఉద్యమం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు వచ్చేనెల 9వ తేదీ లోగా పింఛన్‌ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నర్సయ్య హెచ్చరించారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. నెలకు రూ.30 వేల పింఛన్‌, 250 గజాల స్థలం మంజూరు చేయడమే కాక ఉచిత కార్పొరేట్‌ వైద్యం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించి నామినేటేడ్‌ పదవులలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పిల్లి రాజయ్య, శ్రీపాద సత్యనారాయణ, కాకెల్లి సైమన్‌, సప్తార్‌ బేగ్‌, గాజుల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement