ఎన్‌హెచ్‌తో హరితం హరీ! | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌తో హరితం హరీ!

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

అటు రవాణా..

ఇటు పర్యావరణానికి ముప్పు

వేలాది చెట్ల తొలగింపుతో

పర్యావరణ ప్రేమికుల్లో ఆవేదన

పర్యావరణ సమతూకంపై

దృష్టి సారించాలని వినతులు

మొక్కలు నాటాల్సిందే..

సమతుల్యత తప్పనిసరి

టేకులపల్లి రూరల్‌: గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే జాతీయ రహదారులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాయి. అయితే అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల్ని కోల్పోవల్సి వస్తే భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కేంద్ర పభుత్వం హైదరాబాద్‌ రింగ్‌రోడ్డును కలుపుతూ గౌరెల్లి నుంచి వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్‌, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం నెహ్రూనగర్‌ వరకు జాతీయ రహదారి ఎన్‌హెచ్‌– 930పీ నిర్మాణం చేపట్టింది. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ దూరం, సమయం తగ్గడంతోపాటు వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. అదే క్రమంలో రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులకు దశాబ్ధాల నాటి వృక్షాలను వేల సంఖ్యలో తొలగించాల్సి రావడం పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షకుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మూడు ప్యాకేజీల్లో హైవే నిర్మాణం

ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ. 1,915 కోట్లు వెచ్చించి మూడు ప్రధాన ప్యాకేజీలుగా విభజించారు. గౌరెల్లి – వలిగొండ వరకు రూ.690.33 కోట్లు, వలిగొండ – తొర్రూరు రూ.549.28 కోట్లు, తొర్రూరు నుంచి కొత్తగూడెం నెహ్రూనగర్‌ రూ. 675.45 కోట్లను కేటాయించింది. 2028 జూలై నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే గడువు లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. అయితే అనుకున్నమేర పనుల పురోగతి లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రత్యామ్నాయం ఏమిటి?

రోడ్ల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణానికి చెట్లను తొలగిస్తే ఆయా ప్రాంతాల్లో పచ్చదనం తగ్గనుంది. నేటి అవసరాలకు రహదారులు తప్పనిసరే అయినా దీంతో ఎదురయ్యే పర్యావరణ నష్టాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ మేరకు నరికే చెట్లకు బదులు రెట్టింపు సంఖ్యలో కొత్తవి నాట డం, అనుకూలంగా ఉన్న చెట్లను వేళ్లతో సహా తొలగించి ఇతర ప్రాంతాల్లో నాటే అంశంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

రోడ్ల విస్తరణ, నిర్మాణాల పేరుతో వందల ఏళ్ల నాటి పెద్ద చెట్లను తొలిగించడం ఆందోళన కలిగించే అంశం. తొలగించిన చెట్ల స్థానంలో అంతే సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తే నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవచ్చు. – ధర్మపురి వీరబ్రహ్మాచారి,

న్యూడెమోక్రసీ నాయకుడు

ప్రజా జీవనానికి రోడ్లు అవసరమే. ఇదే సమయాన ఏళ్ల నాటి చెట్లను తొలగింపుతో పర్యావరణానికి ముప్పు ఏర్పడనుంది. ప్రామాణిక పద్ధతులను ఎంచుకుని వాతావరణ సమతుల్యతను కాపాడాలి. – బోడా బాలునాయక్‌,

టేకులపల్లి సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement