భద్రాచలంటౌన్: భద్రాచలంలోని కూనవరం రోడ్డు ఇసుక రీచ్ సమీపాన ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 3.5 కిలోల ఎండు గంజాయిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన మస్క్ మున్నా, జున్జు శ్రీనివాస్ ఏపీలోని మారేడుమిల్లి నుంచి ఘట్‌కేసర్‌కు బైక్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరి నుంచి గంజాయితో పాటు బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నరేందర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీహరివరావు పాల్గొనగా, తదుపరి విచారణ కోసం నిందితులను భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు.


