గుట్టు బయటపెట్టిన మామిడి చెట్టు! | - | Sakshi
Sakshi News home page

గుట్టు బయటపెట్టిన మామిడి చెట్టు!

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● కాలు జారడంతో వెలుగుచూసిన మోసం ● వ్యాపారులు పదిలం.. పేదల బంగారంపై ఆందోళన

● కాలు జారడంతో వెలుగుచూసిన మోసం ● వ్యాపారులు పదిలం.. పేదల బంగారంపై ఆందోళన

అశ్వారావుపేట: ‘మాయల ఫకీరు ప్రాణం చెట్టు తొర్రలో’ అన్నట్లుగా బంగారు తాకట్టు గుట్టును మామిడి చెట్టు బయటపెట్టింది. అశ్వారావుపేటకు చెందిన యువకుడు సుబ్బు పలువురి నుంచి బంగారం సేకరించి అవసరమైన నగదుకు మించి ఒకరి పేరుతో ఇంకొకరి ఆభరణాలు తాకట్టు పెట్టడం, ఆ వివరాల రశీదులన్నీ తన వద్దే ఉంచుకుంటాడని సమాచారం. అయితే, ఇన్నాళ్లు విషయం బయటకు రాకున్నా ఓ మామిడి చెట్టు ఈ గుట్టును బయటపెట్టడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

కాయ కోస్తుండగా ప్రమాదం

అశ్వారావుపేటకు చెందిన సుబ్బుకు అనారోగ్యం కారణంగా ప్రతిరోజు నిద్రించే ముందు ఇంటి వెనకాల పునాస మామిడి కాయ తినడం అలవాటని తెలిసింది. పది రోజుల క్రితం కాయ కోసే క్రమంలో ఆయన చెట్టు పైనుంచి జారి పడగా గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమాన ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో అశ్వారావుపేటలోని వ్యాపారులకు తెలిసింది. దీంతో పలువురి బంగారాన్ని సుబ్బు తమ వద్ద బంగారాన్ని మారుపేర్లతో తాకట్టు పెట్టిన విషయం బయటపెట్టారు. అయితే, పత్రాలన్నీ సుబ్బు వద్దే ఉండడంతో ఎవరి బంగారం ఇంకెవరి పేరిట తాకట్టు పెట్టాడో తెలియక జనాల్లో ఆందోళన మొదలైంది. ఇదే సమయాన నలుగురు వ్యాపారులు, ఫైనాన్స్‌ వ్యాపారి, వడ్డీ వ్యాపారులు ఆభరణాలను విడిపించేసుకున్నారని తెలిసింది. ఇందులో కొందరు యజమానికి అవసరమైన దాని కంటే 2 – 3 రెట్లు అప్పు తీసుకుని ఆ డబ్బుతో వ్యాపారాలు చేసేవారని సమాచారం. ఇంకొందరు సబ్బు ద్వారా ఇంకొందరి పేర్లతో తాకట్టు పెట్టించి, సుబ్బుతో పాటు బ్యాంకుల సిబ్బందికి వాటాలు ఇచ్చేవారన్న ప్రచారం జరుగుతోంది.

మళ్లీ వ్యాపారమే..

గత శుక్రవారం నుంచి పలు మలుపులు తిరుగుతున్న వ్యవహారంలో సుబ్బు వద్ద వందలాది తాకట్టు స్లిప్పులు బయటపడ్డాయి. ఎవరి బంగారం ఎవరి పేరుతో తాకట్టు పెట్టాడో వెల్లడించినా.. యజమాని తీసుకున్న అప్పు కంటే బ్యాంకులో బినామీ పేరుతో మూడు, నాలుగు రెట్ల అప్పు ఉండడం గమనార్హం. దీంతో యజమని బాకీ చెల్లించినా ఆభరణం విడుదల చేయలేని పరిస్థి ఉండగా, మిగతా రుణం ఎవరు తీసుకున్నారో సుబ్బు వెల్లడించాల్సి ఉంది. కాగా, మంగళవారం వరకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు పట్టించుకోవడం లేదని సమాచారం. అయితే, పోలీసులను ఆశ్రయిస్తే బంగారం తాకట్టు పెట్టిన రశీదులు దక్కవనే బెదిరింపులతో బాధితులు ముందుకు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement