డీ ఫిల్లరింగ్‌ చేపడితే 2 వేల టన్నుల ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

డీ ఫిల్లరింగ్‌ చేపడితే 2 వేల టన్నుల ఉత్పత్తి

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్‌లైన్‌ గనిలో రానున్న ఆరు నెలల్లో డీ ఫిల్లరింగ్‌ పనులు చేపడితే రోజుకు 2 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని పీవీకే–5 ఇంక్‌లైన్‌ గని మేనేజర్‌ రాసకట్ల రవికిరణ్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గనిలో అనుభవం ఉన్న అధికారుల సంఖ్య కంటే యువ అధికారుల సంఖ్య అధికంగా ఉందని, పనులపై పూర్తిగా అవగాహన లేని కారణంగా ఆశించిన ఉత్పత్తి రావటం లేదన్నారు. గనికి మరో 9 సంవత్సరాల జీవిత కాలం ఉందని తెలిపారు. గైర్హాజరు కార్మికులకు కుటుంబాలతో సహా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.

భద్రాచలంవాసికి

ప్రశంసా పత్రం

భద్రాచలంటౌన్‌: కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో పట్టణానికి చెందిన పీఎస్‌వీ ప్రసాద్‌ బాబుకు ప్రశంస పత్రం లభించింది. యూజీసీ సహకారంతో జరిగిన సదస్సులో ‘ఎన్‌ఈపీ–2020 డిజిటల్‌ అసమానతల నివారణ –సాహిత్య బోధన’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. డిజిటల్‌ యుగంలో విద్యార్థులందరికీ సమాన విద్యావకాశాలు, సాంకేతిక వనరులు అందాలంటూ ఆయన చేసిన ప్రసంగం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సదస్సు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. మేఘన రావు, కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వీరబాబు

కొత్తగూడెంఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవే టు విద్యాసంస్థలకు దీటుగా మారుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పసుపులేటి వీరబాబు అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి విద్యార్థులతో పాలాభిషేకం చేయించి మాట్లాడారు. ప్రభుత్వం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉపాధ్యాయులు సురేష్‌, గోపాలకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతో

వ్యక్తి ఆత్మహత్య

తిరుమలాయపాలెం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని జూపెడకు గొల్ల పూడి చంటి(41) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భార్య శ్రీలతతో గొడవ పడిన ఆయన బుధవారం బచ్చోడు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కల్లూరురూరల్‌: కల్లూరులోని కప్పలబంధం రోడ్డు సట్టేరు కుంటకు ప్రాంతంలో సెంట్రింగ్‌ మేసీ్త్రగా పని చేస్తున్న షేక్‌ హబీబ్‌(55) మృతదేహాన్ని గురువారం గుర్తించారు. ఆయన రెండు రోజులుగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈమేరకు సట్టేరుకుంటలోని కల్వర్టు పక్కన మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఆయన కల్వర్టు పైనుంచి పడడంతో మృతి చెందాడా, ఇతర కారణాలు ఉన్నయా అన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement