కుళ్లిపోయిన స్థితిలో పూజారి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

కుళ్లిపోయిన స్థితిలో పూజారి మృతదేహం

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

నెల క్రితం అదృశ్యమైన పోలంపల్లి వాసి

కారేపల్లి: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీ దేవిపల్లి మండలం గట్టుమల్ల అటవీ ప్రాంతంలో బుధవారం మృతదేహంగా కనిపించాడు. కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన మూతి వీరభద్రం (45) వీరభద్రస్వామి ఆలయంలో పూజారిగా కొనసాగుతున్నాడు. నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తున్నారు. ఇంతలోనే గట్టుమల్ల అటవీప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో వీరభద్రం మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్‌ కార్డు, సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతుడిని గుర్తించిన అక్కడి పోలీసులు కుటుంబీకులతో పాటు సర్పంచ్‌కు సమాచారం అందించారు. అవివాహితుడైన వీరభద్రం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆయన ఎలా మృతి చెందాడనేది గుర్తించేందుకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement