నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

ఏన్కూరు: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఏన్కూ రు కేంద్రంగా రెండు, మూడేళ్ల నుంచి నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ‘సాక్షి’లో బుధవారం ‘జోరుగా నకిలీ విత్తనాల విక్రయం?’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ఏడాది మండలంలో నకిలీ విత్తనాలు లభ్యమైన వారి ఇళ్లలో తనిఖీ చేసి ప్రస్తుత కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నారబోయిన సంధ్య, వ్యవసాయాధి కారి నర్సింహారావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయ సమాచారం ఎవరికై నా తెలిస్తే తమకు తెలపాలని సూచించారు. వ్యాపారులు కూడా ప్రభు త్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలే విక్రయించాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement