టేకులపల్లి: మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండాలోని హరిజన చెర్రీ ప్రాథమిక పాఠశాలకు 1985లో భూక్యా చంద్రు సొంత భూమిని విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి 41 ఏళ్లుగా ఎందరో పిల్లలు ఇందులో చదువుతున్నారు. అయి తే, ప్రస్తుతం చంద్రు కుమారుడు దేవుజా కుటుంబీకులు రంగప్రవేశం చేసి వేసవి సెలవుల్లో పాఠశాల ప్రహరీని కూల్చడమే కాక ఆవరణలోని కొన్ని చెట్లను తొలగించారు. అలాగే, పాఠశాల స్థలాన్ని తమ భూమిలో కలుపుతూ దున్నించి ఫెన్సింగ్ వేశారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాగే కొంత స్థలాన్ని కలుపుకున్నట్లు తెలిసింది. ఈసారి కూడా అలాగే చేయగా పాఠశాలలు తెరిచేందుకు సోమవారం వచ్చిన హెచ్‌ఎం లక్ష్మణ్, ఉపాధ్యా యులు ఇదేమిటని ఆరా తీస్తే తమ పట్టా భూమిలో కంచె వేసుకున్నామని దేవుజా సమాధానం చెప్పారు. దీంతో మంగళవారం ఎంఈఓ జగన్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రామచంద్ర సింగ్, సర్పంచ్ శివ, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు బానోతు సరోజిని తదితరులు దేవుజాతో చర్చించారు. ఈ విషయమై ఆదివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
దాత వారసుల తీరుతో వివాదం


