గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్‌

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

బూర్గంపాడు: బైక్‌పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్‌ పల్సర్‌పై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సారపాక పల్లెప్రకృతి వనం వద్ద మంగళవారం ఎస్‌ఐ ప్రసాద్‌ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.1.05 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. రవాణా చేస్తున్న మలుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బడే భరత్‌, ఉప్పరపల్లి వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణపై కేసు

దమ్మపేట: మండలంలోని గణేశ్‌పాడు శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై మంగళవారం కేసు నమోదైంది. గణేశ్‌పాడు శివారులో 4.04 ఎకరాల ప్రభుత్వ భూమిని సత్తుపల్లి మండలం రామగోవిందాపురం గ్రామానికి చెందిన ఊకే రాములు, కనసాని జగ్గాచారి ఆక్రమించారు. ఈ భూమిలో వరి సాగు చేయయడమే కాక పంట కూడా తీసుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్‌ రామనరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

ఓటర్ల మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

కారేపల్లి: 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయడమే కాక ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వేకు ఉద్యోగులు సిద్ధం కావాలని ఖమ్మం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. కారేపల్లిలో మంగళవారం బీఎల్‌ఓలతో పాటు పార్టీల బీఎల్‌ఏలు, సర్పంచ్‌లతో ఎస్‌ఐఆర్‌(ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ)పై అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. తొలుత ఉద్యోగులతో సమావేశమైన అదనపు కలెక్టర్‌ ఇప్పటి వరకు పూర్తయిన మ్యాపింగ్‌పై ఆరా తీశాక మిగతా వారిని విభాగాల వారీగా విభజించిఇంటింటికి సర్వే సమయాన ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు సేకరించాలని ఆదేశించారు. ఈవిషయంలో పార్టీల బీఎల్‌ఏలు, సర్పంచ్‌లు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. సింగరేణి తహసీల్దార్‌ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్‌, సర్పంచ్‌లు మేదరి టోనీవీరప్రతాప్‌, భూక్యా రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement