మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా గోపాలపురం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు కృష్ణారెడ్డి – పద్మకు నేను, అన్నయ్య సంతానం. చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుతూ అన్నయ్యతో పాటు స్కూల్‌కి వెళ్లగా, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సైదులు ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదో తరగతి నుంచి ఊరికి ఐదు కి.మీ. దూరాన పాఠశాలకు సైకిల్‌పై వెళ్లేవాళ్లం. పదో తరగతి తర్వాత సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ నాన్న కోరికతో ఇంటర్‌లో బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదివి, చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశా. ఆపై సంగారెడ్డిలో పీజీ అనంతరం 2018లో ప్రభు త్వ వైద్యుడిగా ఎంపికయ్యా. తొలి పోస్టింగ్ భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రాగా, ఇక్కడే సూపరింటెండెంట్ స్థాయి కి చేరా. మా ఊరిలో మొట్టమొదటి వైద్యుడిని నేనే. ఈ స్థాయికి చేరేలా తోడ్పాటునిచ్చిన నాన్న, అన్నయ్యతో పాటు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా.
–డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, భద్రాచలం ఆస్పత్రి ఆర్‌ఎంఓ


