పోలీసుల బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

బూర్గంపాడు: ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం ఇసుక లారీలను స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగగా.. సమాచారంతో బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు మంగీలాల్‌, శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వారు మోటార్‌ సైకిల్‌పై వస్తున్న క్రమంలో దోమలవాగు వద్ద వెనుక నుంచి ఇసుక లారీ వేగంగా ఢీకొట్టింది. మంగీలాల్‌, శ్రీనివాసరావుకు గాయాలు కాగా.. భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మోటార్‌ సైకిల్‌, రెండు ట్యాబ్‌లు ధ్వంసమయ్యాయి. లారీడ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

లోన్‌ ఇప్పిస్తామని దగా..

భద్రాచలంఅర్బన్‌: లోన్‌ ఇప్పిస్తామని సైబర్‌ నేర గాళ్లు దంపతులను బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని భగవాన్‌దాస్‌కాలనీకి చెందిన మానస గత ఏప్రిల్‌ 4న ఫేస్‌బుక్‌ చూస్తోంది. అందులో 83429 94417 నంబర్‌లో సంప్రదిస్తే లోన్‌ ఇప్పిస్తామని ఉండటంతో భర్త నర్సింహారావు సహకారంతో ఫోన్‌ చేశారు. సైబర్‌ నేరగాడు వారి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కావా లని అడగగా.. నర్సింహారావు, మానసలకు చెందిన కార్డులను పంపించారు. అయితే, రుణ ప్రక్రియకు రూ.52 వేలు అవసరం అవుతాయని చెప్పి.. తాను పంపించే స్కానర్‌కు డబ్బు పంపాలని చెప్పాడు. అది నమ్మిన దంపతులు పలు దఫాలుగా రూ.52 వేలు పంపించారు. తర్వాత సైబర్‌ నేరగాడు ముఖం చాటేడయండో బాధితురాలు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, శనివారం అర్ధరాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయగా టౌన్‌ సీఐ నాగరాజు కేసు నమోదు చేశారు.

వీధి కుక్కల దాడిలో

మహిళకు తీవ్రగాయాలు

బూర్గంపాడు: సారపాక మేజర్‌ గ్రామ పంచాయతీలోని శ్రీరాంపురంకాలనీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం ఓ మహిళపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు గమనించి రాళ్లు విసిరి కుక్కలను తరిమివేయటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. స్థానికులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీరాంపురంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోజూ ఎవరినో ఒకరిని గాయపరుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

షార్ట్‌సర్క్యూట్‌తో జేసీబీలో పొగలు

మణుగూరుటౌన్‌: పట్టణంలో ఓ ప్రాంతం నుంచి బయలుదేరిన జేసీబీలో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌తో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆపరేటర్‌ వెంటనే దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన పట్టణంలో సీపీఐ కార్యాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరేలోపే స్థానికులు, ఆపరేటర్‌తో కలిసి జేసీబీ పొగలను అదుపులోకి తెచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement