పాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని శనివారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో హోమం జరిపారు. తొలుత మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామి వారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ రుద్రహోమం గావించారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించా రు. పూజలో పాల్గొన్న ఏడుగురు భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదా లను అందజేశారు. ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేక పూజలు నిర్వహించారు.
నేడు జూనియర్ కెమిస్ట్ పోస్టులకు రాత పరీక్ష
రుద్రంపూర్: కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జూనియర్ కెమిస్ట్/జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. 17 ఖాళీ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయగా, 695మంది దరఖాస్తు చేసుకున్నా రు. అభ్యర్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు.
గిరిజన యువతకు ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: గిరిజన యువతకు ఐటీడీఏ ఆధ్వర్యంలోని యువజన శిక్షణా కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి. రాహు ల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 33 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా వైటీసీ కేంద్రానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


