ప్రాణదాతలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణదాతలు..

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ఒకరి రక్త దానం..

మరొకరికి ప్రాణదానం

ఒకరి రక్తంతో ముగ్గురికి ప్రాణం

రక్తదానంపై కొరవడిన అవగాహన

స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన శిబిరాలు

సమాచారం అందితే స్పందిస్తాం..

ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేయండి

ఎవరు దానం చేయొచ్చు..

రక్తదానం చేయడానికి కొందరు భయపడిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 168సార్లు రక్తదానం చేయొచ్చు. ఈనేపథ్యాన

● ఆరోగ్యంగా ఉండి 18 నుంచి 60 ఏళ్లలోపు వారు రక్తదానం చేయొచ్చు.

● మత్తు మందులకు అలవాటుపడినవారు, హెపటైటిస్‌ బీ, సీ, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తం ఇవ్వడానికి అవకాశం లేదు.

● ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలు అయితే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల తర్వాతే రెండోసారి రక్తం ఇవ్వాలి.

● శరీర బరువు సగటున 45 కేజీలు ఉండి హిమోగ్లోబిన్‌ కనీసం 12.5 గ్రాములు ఉండాలి.

ఒకరి రక్తం.. ముగ్గురికి ప్రాణం..

ఒక వ్యక్తి దానం చేసే రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌బ్లడ్‌ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్‌, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలిసిన ద్రవం ఉంటుంది. రక్తం ఇవ్వగానే దాన్ని వివిధ కాంపోనెంట్లుగా విభజిస్తారు. ఒక హోల్‌ బ్లడ్‌ను కనీసం మూడు రకాల కాంపోనెంట్లుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కరి రక్తమే కనీసం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. దీనిని మరిన్ని కాంపోనెంట్లుగా విడదీసే అవకాశం ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడవచ్చు.

ప్రయోజనాలు..

రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్‌ ప్రొఫైల్‌ తెలుసుకుంటారు. దీంతో ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా లేదో తెలుసుకుని పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. రక్తనష్టాన్ని భర్తీచేయడం కోసం 4–8 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్ర రక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్ధరణను సరిచేస్తుంది.

కొరవడిన అవగాహన..

గతంలో రక్తదానంచేయడంపై ఉన్న అవగాహన కార్య క్రమాలు, ప్రజల్లో ఉన్న సేవా భావం కరోనా విజృంభన తదుపరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రజల్లో ఏర్పడిన అపోహలను అధికారులు పోగొట్టేందుకు చేయాల్సిన అవగాహన కార్యక్రమలు తూతూ మంత్రంగానే చేస్తున్నా రు తప్ప పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. ఇకనైనా అధికారులు రక్తదానంపై విస్తత ప్రచారం చేసి, అవగాహన కల్పిస్తే ఎందరో ప్రాణాలను కాపాడవచ్చు.

భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో

గడిచిన ఐదేళ్లుగా..

● గడిచిన ఐదేళ్లుగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 12 వేల యూనిట్ల రక్తం సమకూరగా.. ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 70 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంది.

● నిత్యం ‘ఓ’పాజిటివ్‌ రక్తం నిల్వలు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ‘ఓ’పాజిటివ్‌తో పాటు ‘ఎ’పాజిటివ్‌ రక్తం ఎక్కువగా అవసరమవుతుంది.

● రక్తం నిల్వలకు 300 యూనిట్ల స్టోరేజ్‌ రిఫ్రిజిరేటర్లు, ప్లేట్‌లెట్ల మెషిన్‌, ప్లాస్మా స్టోరేజ్‌ రిఫ్రిజిరేటర్‌(– 80 డిగ్రీలు) అందుబాటులో ఉన్నాయి.

● ఇప్పటివరకు అక్రమంగా అమ్ముకుంటూ దొరికిన సంఘటనలు లేవు.

● ప్రతి నెలా ఐదుగురు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఐదు యూనిట్ల రక్తాన్ని ఇస్తున్నారు.

● వివిధ ప్రమాదాల్లో గాయపడిన 1,200 మందికి రక్తాన్ని అందించారు.

● పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కామెర్లతో బాధపడుతూ అత్యవసరంగా రక్తం కావాల్సి ఉన్న రెండేళ్ల చిన్నారికి ఈ ఏడాది జనవరి 23న అర్ధరాత్రి మురళి అనే వ్యక్తి రక్తదానం చేయడంతో చిన్నారి ప్రాణాలకు కాపాడారు.

● భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఫ్రిబవరి 3న 14 రోజుల నవజాత శిశువుకి ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువ ఉండడంతో మురళి రక్తదానం చేశారు.

● అలాగే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జనవరి 31వ తేదీన తల్లికి బిడ్డకి ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉంటడంతో అర్ధరాత్రి 12.30కి మురళి రక్తదానం చేశారు

రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చేందుకు రక్తం ఎక్కించడమే మార్గం కావడంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమాజం కోసం ఇప్పుడు రక్తదాతలు అవసరం.

– భద్రాచలంఅర్బన్‌

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

మదర్‌థెరిస్సా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యువకులంతా కలిసి రక్తదానం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 61 సార్లు రక్తదానం చేశాను. పట్టణంలో అనేక సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. రానున్న కాలంలో ఈ సేవలను మరింత విస్తృత పరుస్తాం.

– మురళి, మదర్‌థెరిస్సా చారిటబుల్‌ ట్రస్ట్‌

నిర్వాహుకుడు, భద్రాచలం

రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భద్రాచలంలో ఉన్న రక్తదాతతు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రక్తదానం చేయండి. రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున స్వచ్ఛందంగా యువత ముందుకురావాలి. శుభకార్యాలు, పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలి. – డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి,

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, భద్రాచలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement