తెల్లరాయి తరలిపోతోంది | - | Sakshi
Sakshi News home page

తెల్లరాయి తరలిపోతోంది

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

చర్యలు తీసుకుంటాం..

పాల్వంచరూరల్‌: భూగర్భంలో లభించే ప్రత్యేకమైన, ఎంతో విలువైన వైట్‌ క్వార్జ్‌ (తెల్లరాయి) అక్రమంగా తరలిపోతోంది. తవ్వకం, రవాణా బాహాటంగానే సాగిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని బిక్కుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం శివారు సూరారంవైపు వెళ్లే మార్గంలో ఓ రైతు భూమిలో తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి. వాటి తవ్వకాలకు మైనింగ్‌, రెవెన్యూ శాఖల ద్వారా అనుమతులు పొందిన తర్వాతనే క్వారీ నిర్వహించాల్సి ఉండగా కొందరు నాయకుల అండదండలతో తెల్లరాయి ఉన్న భూమిలో క్రేన్‌ సాయంతో పెకిలించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిసింది. కాగా, తెల్లరాయిని గ్లాస్‌(అద్దాలు) తయారీలో ఇతర పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తారు. కంప్యూటర్‌ చిప్స్‌, పౌడర్ల తయారీకి వినియోగిస్తుంటారు. దీంతో తెల్లరాయికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ముందుగా తెల్లరాయిని పరీక్షించిన తర్వాత నాణ్యతను బట్టి ధరను నిర్ధారిస్తారు. తెల్లరాయిని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే టన్నుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అలా జరగడం లేదని సమాచారం.

అనుమతిలేకుండానే క్వారీ నిర్వహణ?

బిక్కుతండా పంచాయతీలో తెల్లరాయి తవ్వ కాలు నిర్వహిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. మైనింగ్‌ ద్వారా గానీ, రెవెన్యూ శాఖ దారా గానీ తప్పనిసరిగా తవ్వకాలకు అనుమతులు ఉండాలి. అనుమతులు లేకుండా తెల్లరాయి క్వారీని నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– దారా ప్రసాద్‌, తహసీల్దార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement