మణుగూరు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు లొంగిపోయిందని, దేశ సంపదను కార్పొరేట్లు, ట్రంప్ కాళ్ల దగ్గర పెడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. గురువారం పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రూ. 70వేల కోట్ల వ్యవసాయ రంగాన్ని అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైల్ భరో ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తుపాకీ రాముడి మాటలు చెబుతున్నారని అన్నారు. నాయకులు అన్నవరపు కనకయ్య, బి.చిరంజీవి, చిట్టి వినోద, మర్మం చంద్రయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్, వినోద, నిమ్మల వెంకన్న, శ్రీనివాస్, సాంబశివరావు, నర్సింహారావు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్


