మణుగూరు రూరల్/భద్రాచలం అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం అడిషనల్ డీఎంహెచ్‌ఓ కార్యాలయం, మలేరియా డ్రగ్ స్టోర్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయాలన్నారు. మలేరియా మాసోత్సవాలను, ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏసీఎం, స్టిరప్ పంపులు, ఫాగింగ్ మెషిన్ల వివరాలను అందించాలన్నారు. అధికారులు ప్రతాప్, హరీష్, శ్రీధర్, పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్


