ఇల్లెందురూరల్: పొదుపు సంఘాల నిర్వహణతోపాటు వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధిస్తామని, పంటల విక్రయం, కొనుగోళ్లలో అగ్రభాగాన నిలుస్తామని తెలంగాణ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సూర్నపాక విజయ అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సాధించిన ప్రగతిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం ఉపాధ్యక్షురాలు ధనసరి శివసరిత, డీపీఎంలు సమ్మక్క, నర్సయ్య, ఏపీఎంలు వెంకయ్య, కరుణాకర్, రామకృష్ణ, సీఈవో ప్రగతి, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘం
జిల్లా అధ్యక్షురాలు విజయ


