లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలోని హోటళ్లు, లాడ్జీ ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు 62 లాడ్జీలు, హోటళ్లలో సోదాలు నిర్వహించారు. అతిథుల గుర్తింపు పత్రాలు, ఆధార్‌ కార్డులు, గెస్ట్‌ రిజిస్టర్‌లు, చెక్‌ఇన్‌ వివరాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతకు సంబంధించిన ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీస్‌ జాగిలంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వివరాలు సేకరించారు. దాదాపు 30 మంది ప్రయాణికులను విచారించారు. ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ హోటళ్లు, లాడ్జీలకు వచ్చేవారి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీఐ నాగరాజు ఎస్‌ఐలు సతీష్‌, శ్యాం, రామకృష్ణ, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement