ప్రధాని సభను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రధాని సభను జయప్రదం చేయండి

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

చుంచుపల్లి: హైదరాబాద్‌లో ఈ నెల 10న జరగనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండగా.. జిల్లా నుంచి పార్టీ శ్రేణు లు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆదిలాబాద్‌ ఎంపీ జి.నగేశ్‌ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వాన అమలుచేస్తున్న పథకాలతో దేశంలో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాన్ని సైతం చేజిక్కించుకుందని తెలిపారు. కాగా, మహిళలకు చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల బిల్లును ప్రవేశపెడితే అడ్డుకున్న పార్టీల తీరును ప్రజలు గుర్తించారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పాలన సాగుతున్న నేపథ్యాన రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ గెలుపొందడం ఖాయ మని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement