కొత్తగూడెంఅర్బన్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు బుధవారం కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్‌లో వేలంపాట జరగనుందని సీఐ జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఎవరైనా ఉదయం 10 గంటలకు హాజరై వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు.
వాటర్ డిస్పెన్సరీ వితరణ
జూలూరుపాడు: పాపకొల్లు రైతు వేదికకు అదే గ్రామానికి చెందిన రైతు ధర్మరాజుల వెంకటనారాయణ రూ.9వేల విలువ గల వాటర్ డిస్పెన్సర్‌ను మంగళవారం వితరణ చేశారు. కార్యక్రమంలో రైతులు యాసా రోశయ్య, బాలు, చందర్, నర్సింగ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించాలి
సుజాతనగర్: ఇందిరమ్మ ఇంటి బిల్లులు తక్షణమే చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షడు గుగులోత్ రాజేష్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను విస్మరించి గ్రామసభల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాది కావస్తున్నా మొదటి బిల్లులు రాక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బిల్లులు త్వరితగతిన చెల్లించాలని పేర్కొన్నారు.


