నిత్య జీవితంలో సైన్స్‌ను అన్వయించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: నిత్యజీవితంలో విద్యార్థులు సైన్స్‌ను అన్వయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆనందఖని పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పోటీల్లో జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వరుణ్‌సా యి ప్రథమ బహుమతి సాధించారు. ద్వితీయ బహుమతిని ఆనందఖని ఉన్నత పాఠశాల విద్యార్థి బి. ధనుష్, తృతీయ బహుమతి భద్రాచలం పాఠశాల విద్యార్థి షేక్ నజీమాలు సాధించారు. డీఈఓ విజేతలకు బహమతులు అందించి మాట్లాడారు. అధికారులు సంపత్ కుమార్, నాగరాజ్ శేఖర్, సైదులు, సతీష్, అమీరుద్దీన్, యశోద, అనురాధ, మోహన్ పాల్గొన్నారు.


