రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

రోడ్డు ప్రమాదంలో  ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్టు వంతెన వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పూనం అనిల్‌ మరో వ్యక్తితో బైక్‌పై అశ్వాపురం వైపు వస్తుండగా కొత్తగూడెం వైపు వెళ్తున్న ట్రాలీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వస్తున్న కాంగ్రెస్‌ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేశ్‌ వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

సుజాతనగర్‌: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆధివారం వెలుగుచూసింది. స్థానిక నందనవనంకాలనీకి చెందిన రఘురాం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 18న ఊరెళ్లాడు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లగా ఇంటి తలుపుల తాళం పగలగొట్టి ఉండటం చూసి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఇంటికి చేరుకున్న కుంటుబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.

అన్న కుమారుడిపై దాడి

పాల్వంచ: సొంత అన్నకుమారుడిపైనే దాడి చేసిన వ్యక్తిపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పాత పాల్వంచ బొడ్రాయిసెంటర్‌కు చెందిన కట్టెబోయిన వెంకటేశ్వర్లు తన తల్లిపేరున ఉన్న కరెంట్‌ మీటర్‌ను పెట్టుకున్నాడు. ఈ విషయంలో వెంకటేశ్వర్లు ఇంటి వద్ద లేని సమయంలో అతని కుమారుడు ప్రణయ్‌దాస్‌పై బాబాయి అయిన కట్టెబోయిన శ్రీనివాసరావు ఈ నెల 16వ తేదీన దాడి చేశాడు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని గాయాలైన కొడుకును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ఆదివారం ప్రణయ్‌దాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement