భారజలం ఉత్పత్తిలో భేష్
మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు ఉత్తమ అవార్డు
అశ్వాపురం: భారజలం ఉత్పత్తిలో మణుగూరు భారజల కర్మాగారం ఉత్తమ పనితీరు కనబరిచింది. ఎన్నో ఏళ్లుగా భారజల ఉత్పత్తి, ఎగమతుల్లో అగ్రస్థానంలో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్లాంట్.. 2025 సంవత్సరానికి గాను ఉత్తమ ప్లాంట్ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్‌కుమార్ మహంతి, డీఏఈ మాజీ చైర్మన్ ఏఎన్ వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్, భారజల బోర్డు చైర్మన్ సత్యకుమార్ తదితరుల చేతుల మీదుగా మణుగూరు కర్మాగారం జీఎం శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, డి.వి.చారి, విష్ణువర్దన్‌రాజు, ప్రభాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


