కష్టానికి ‘ఫలం’ దక్కేనా ? | - | Sakshi
Sakshi News home page

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

కష్టా

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

● ఆందోళన చెందుతున్న మామిడి రైతులు ● పూత దశలోనే ఆశిస్తున్న తెగుళ్లు ● రాలిపోతున్న పూత.. మసిబారుతున్న చెట్లు

పూత చూసి ఆనందించాం

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

● ఆందోళన చెందుతున్న మామిడి రైతులు ● పూత దశలోనే ఆశిస్తున్న తెగుళ్లు ● రాలిపోతున్న పూత.. మసిబారుతున్న చెట్లు

ఇల్లెందురూరల్‌ : ఉమ్మడి జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటల్లో ముఖ్యమైనది మామిడి. ఫలరాజుగా గుర్తింపు పొందిన ఈ పంట కొంతకాలంగా ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. ప్రస్తుత సీజన్‌లోనూ రైతులకు నిరాశ తప్పేలా లేదు. ఇప్పుడు పూత బాగానే వచ్చినా అది నిలవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 57వేల ఎకరాల్లో..

ఉమ్మడి జిల్లాలో సుమారు 57 వేల ఎకరాల్లో మామిడితోటలు విస్తరించి ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, టేకులపల్లి, జూలూరుపాడు మండలాల్లో, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల పరిధిలో మామిడి సాగు అధికంగా ఉంది. బంగినపల్లి, దశేరి, కేసరి, హిమాయత్‌, రాయల్‌ స్పెషల్‌, తోతాపూరి, చిన్న రసాలు, పెద్దరసాలు తదితర రకాలు సాగు చేస్తున్నారు.

ఆశాజనకంగా పూత..

మామిడిలో కొన్నేళ్లుగా నిర్దేశిత సమయానికి ముందుగా లేదంటే ఆలస్యంగా పూత వస్తోంది. సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైతేనే పూత సక్రమంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, మామిడి రకాలను బట్టి డిసెంబర్‌ నుంచి జనవరి నెలాఖరు వరకు పూత ఉధృతి పెరుగుతుంది. ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు మామిడికి అనుకూలంగా ఉండడంతో చెట్లకు విపరీతమైన పూత రావడంతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు ఆశగా ఉన్నారు.

మంచు ప్రభావంతో తెగుళ్లు..

మామిడి పూత అధికంగానే ఉన్నప్పటికీ.. మంచు ప్రభావంతో చెట్లను తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో తోటల్లో ఎక్కువగా తేనె మంచు, మసి, బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి ప్రభావంతో పూత చాలా వరకు రాలిపోతోంది. కొన్ని చెట్ల ఆకులు నలుపు రంగులోకి మారాయి. తెగుళ్ల నివారణకు రైతులు మూడు, నాలుగు సార్లు మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించక ఆందోళన చెందుతున్నారు. చలికాలంలోనే పూత నిలబడి బటానీ గింజ సైజులో కాయలు ఏర్పడితే ఎండలు ముదిరేకొద్దీ కాయ సైజు పెరిగి అధిక దిగుబడి వస్తుంది. కానీ ఈ దశలోనే తెగుళ్లు ఆశించగా కాయ పక్వానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొంత ఆలస్యమైనా ఆశాజనకంగా పూత రావడంతో సంతోషించాం. కానీ పది రోజులుగా మామిడిని తెగుళ్లు ఆశిస్తుండగా పూత రాలిపోతోంది. చెట్లు మసిబారుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు.

– మంచె కృష్ణయ్య, కొమరారం

ఈ సీజన్‌లో మామిడి పూత ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంది. పూత పిందెగా మారుతున్న దశలో రాత్రి వేళ చలి ప్రభావంతో తెగుళ్లు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పూత నిలిచేలా మందులు పిచికారీ చేయాలి. – కిషోర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?1
1/3

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?2
2/3

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?3
3/3

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement