అంతర్రాష్ట్ర ఇసుకాసురులు.. | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర ఇసుకాసురులు..

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

అంతర్

అంతర్రాష్ట్ర ఇసుకాసురులు..

దూర ప్రాంతాలకు

లాంగ్‌ చాసిస్‌ లారీల్లో..

ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతాలకు అక్రమంగా రవాణా దందాను అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులు నిర్లక్ష్యం వీడని మైనింగ్‌, పోలీస్‌, అటవీ, రెవెన్యూ, రవాణాశాఖలు

ఇసుక, మట్టి మాఫియా వివాదం?

సరిహద్దు మండలాలకు టిప్పర్ల ద్వారా..

అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, సత్తుపల్లి, కందుకూరు తదితర మండలాలకు వ్యాపారులు ఇసుక రవాణా చేస్తుండగా, ఖమ్మం, హైదరాబాద్‌ నగరాలకు బడాబాబులతో కూడా మాఫియా ముఠా రవాణా చేస్తున్నట్లు సమాచారం. రవాణాకు సరిహద్దు మండలాలకై తే టిప్పర్‌ లారీలు, దూర ప్రాంతాలకు లాంగ్‌ చాసిస్‌ ఉన్న లారీలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక, ఏపీలోని ఇసుక వ్యాపారులు కుమ్మకై ్క అనుమతులు లేకుండా ఇసుక విక్రయాలు చేపడుతున్నారు. ఏపీ ఇసుక టన్ను ధర రూ. 1,100 ధర ఉండటంతోపాటు నాణ్యత ఉందని స్థానికులు చెబుతున్నారు. అదే తెలంగాణ ఇసుక రీచ్‌ల నుంచి టన్ను తెచ్చుకోవాలంటే రూ.1300 చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తెలంగాణ ఇసుక రీచ్‌ల నుంచి టిప్పర్‌లో 24 టన్నులే వస్తుండగా, ఏపీ నుంచి వచ్చే టిప్పర్‌లో 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు కాసులు వర్షం కురుస్తోంది.

ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేసుకుని..

అశ్వారావుపేట సరిహద్దులోనున్న ఏపీలోని గ్రామాల నుంచి సత్తుపల్లి మండలంలోని మేడిశెట్టివారిపాలెం, గంగారం గ్రామాలకు చేరుకుని అక్కడి నుంచి యథేచ్ఛగా హైదరాబాదు వైపు వెళుతున్నాయి. కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఉంటూ ఎస్కార్ట్‌ వాహనం లైన్‌ అంతా క్లియర్‌ అని తెలుకుని అశ్వారావుపేట నుంచి ప్రధాన రహదారి ఎక్కి వెళుతున్నాయి. గతంలో కొద్దిరోజులు ఇంకా పూర్తికాని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే మీదుగా వయా ఖమ్మం ద్వారా వెళ/్లనట్టు సమాచారం. హైదరాబాద్‌లో టన్ను ఇసుక ధర రూ.3 వేల వరకు పలుకుతుండటంతో ఇసుకాసురులు రూ. లక్షల కొద్దీ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అడపాదడపా దాడులు..

తెలంగాణ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత నాలుగు నెలల కాలంలో సీజ్‌ చేసిన ఇసుక లారీల్లో ఎక్కువ శాతం సరిహద్దు మండలాలకు వచ్చినవే ఉన్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌ వెళ్లే లారీల ను అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టుకున్న లారీలను మైనింగ్‌ శాఖకు అప్పగిస్తున్నామని, ఆ శాఖ అధికారులే జరిమానా విధిస్తున్నారని స్థానిక పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారులు కూడా ఇసుక లారీలను సీజ్‌ చేసి జరిమానా విఽధిస్తున్నారు. వీరితో పాటు మైనింగ్‌, రెవెన్యూ, రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక దందా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

స్పందించని మైనింగ్‌ ఏడీ

ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్‌ శాఖ ఏడీ దినేష్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. దమ్మపేట ఎస్‌ఐ సాయికిషోర్‌ రెడ్డిని వివరణ కోరగా.. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న లారీలపై నిఘా ఉంచామని తెలిపారు. పట్టుకున్న లారీలను సీజ్‌ చేసి, ఉన్నతాధికారుల ఆదేశాలతో మైనింగ్‌ శాఖకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీలోని కొవ్వూరు నుంచి తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు లాంగ్‌ చాసిస్‌ ఉన్న లారీలను వినియోగిస్తున్నారు. ఒక్కో లారీలో 40 టన్నులకు మించి తరలిస్తున్నారు. తొలుత కొవ్వూరులోని రీచ్‌లో ఇసుక లోడ్‌ చేశాక.. ఇసుకలో ఉన్న నీరు కారిపోయే వరకు 24 గంటలపాటు లారీని పార్కింగ్‌లో ఉంచుతున్నారు. ఆ తర్వాత తరలించుకుపోతున్నారు. ఇసుక మాఫియా మూడు నుంచి ఐదు లారీలకు ఎస్కార్ట్‌గా ఆ కారును ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లారీలు వెళ్లే మార్గంలో కొందరు వ్యక్తులు ముందుగా కారులో వెళ్లి ఆ మార్గంలో పోలీసు, రవాణా, మైనింగ్‌, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులెవరైన ఉంటే లారీల్లో ఉన్న వ్యక్తులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు లేరనే సమాచారం వచ్చాక అతివేగంతో ఖమ్మం, హైదరాబాద్‌ వైపు దూసుకెళ్తున్నాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులు ఇసుక రవాణా ఆపిన మఫియా, మళ్లీ తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అంతర్రాష్ట్ర ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తోంది. ఏపీలోని కొవ్వూరులో ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి సరిహద్దు మండలాలతోపాటు ఖమ్మం, హైదరాబాద్‌ వంటి నగరాలకు లారీల కొద్దీ తరలిస్తోంది. రూ.లక్షల ఆదాయం సొమ్ము చేసుకుంటోంది. తెలంగాణలోని అధికారులు అడపాదడపా ఇసుక లారీలను సీజ్‌ చేస్తున్నా దూర ప్రాంతాలకు వెళ్లే లారీలను నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. –దమ్మపేట

టన్నుల కొద్దీ ఇసుక.. రూ.లక్షల కొద్దీ ఆదాయం

ములకలపల్లి: మండలంలోని పలు ప్రాంతాల నుంచి కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా ఇసుక, మట్టి తోలకాలు సాగిస్తున్నారు. ఇటీవల ఇసుక వ్యాపారులు, మట్టి వ్యాపారుల మధ్య వివాదం ఏర్పడి పోలీస్‌, రెవెన్యూ శాఖకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ఒకరినొకరు దూషించుకున్నట్లు తెలిసింది. జిల్లా స్థాయి అధికారులకు సైతం ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సీతారాంపురం, గుర్రాలకుంట సమీప ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కందకాలు తవ్వించి, అక్రమ రవాణాను నిలువరించేలా చర్యలు మొదలుపెట్టారు. మండలకేంద్రంలోనూ అక్రమ రవాణాను అరికట్టారు. ఈ నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదు చేసుకోవద్దని ఇరువర్గాలు ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనుమతిలేకుండా ఇసుక, మట్టి తరలింపుపై ఇన్‌చార్జి తహసీల్దార్‌ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా.. ఇసుక, మట్టి తోలకాలకు అనుమతి లేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంతర్రాష్ట్ర ఇసుకాసురులు..1
1/1

అంతర్రాష్ట్ర ఇసుకాసురులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement