న్యాయవాదుల విధుల బహిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్‌లో న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్యకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు గేట్ బయట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హన్మంతరావు, చిరంజీవిరావు, పి నాగేశ్వరరావు, కే పుల్లయ్య, మన్మోహన్, ఎర్రపాటి కృష్ణ, శ్రీధర్, మహమ్మద్ సాధిక్ పాషా, మారపాక రమేష్, మహేష్, చిన్నికృష్ణ, విజయ్, రమేష్, ఎర్రా శ్రీను, మధన్‌మోహన్, కేపి తదితరులు పాల్గొన్నారు.


