పోస్టల్ బీమాతోనే కుటుంబానికి భరోసా
భద్రాచలంటౌన్: పోస్టల్ జీవిత బీమా పాలసీ తీసుకుంటే కుటుంబాలకు భరోసా ఉంటుందని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ పర్యవేక్షకుడు వీరభద్ర స్వామి మాట్లాడుతూ పోస్టల్ బీమాలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఈ పాలసీలకు అర్హులని, ఐదేళ్ల తర్వాత రుణ సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. ఏఓ రాంబాబు, పోస్టల్ అధికారులు సూర్యప్రకాష్ రావు, రామ్మోహన్, శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


