ఎన్‌హెచ్‌లో కోల్పోతున్న 3,400 చెట్లు
టేకులపల్లి: జాతీయ రహదారి 930పీ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలోని చెట్లు కనుమరుగు కానున్నాయి. సోమవారం ఫారెస్టు అధికారులు వృక్షాల లెక్కలు పరిశీలించారు. ఇల్లెందు మండలం నెహ్రూనగర్, టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్ నుంచి సాయనపేట వరకు అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన సుమారు పది హెక్టార్ల మేరకు 3,400 వృక్షాలు జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. గుర్తించిన చెట్లకు మార్కింగ్‌లు చేశారు. ఎస్‌డీఓ కరుణాకరాచారి, ఎఫ్‌ఆర్‌వో చలపతిరావు, డీఆర్‌వో వీరబాబు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


