వాతావరణ ం
న్యూస్‌రీల్
నిధులు ప్రకటించినా...
ఎయిర్‌పోర్ట్ లేనట్టేనా?!
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కారిడార్‌లో దక్కని స్థానం
పర్యాటక అభివృద్ధికి నిరాశే ..
ఉమ్మడి జిల్లాలో
రైల్వే లైన్లకు నిధులపై అస్పష్టత
జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు మంచు కురుస్తుంది.
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్‌వర్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రత్యేక ప్రాజెక్టులేవీ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు లేని కారణంగానే ఎలాంటి తాయిలాలు, స్కీమ్‌లు ప్రకటించలేదని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించగా.. ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఊరట కలిగించే అంశాలేమీ లేవని పెదవి విరుస్తున్నారు. ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతను ప్రోత్సహించేలా ప్రత్యేక కారిడార్‌ను ప్రకటించినా అందులో తెలంగాణ లేకపోవడం గమనార్హం. ఇదే అంశం ప్రాతిపదికన కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినా కారిడార్‌లో స్థానం లేకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఒకటి, రెండు అంశాలు తప్ప ప్రత్యేకంగా నిధులు, పథకాలు, ప్రాజెక్టులేవి జిల్లాకు మంజూరు కాకపోవడం గమనార్హం.
కారిడార్‌లో మనం ఎక్కడ?
సెల్‌ఫోన్ చిప్‌ల తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు కేంద్రం బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కారిడార్‌ను ప్రకటించగా అందులో ఒడిశా – ఏపీ – తమిళనాడు – కర్ణాటకలకు స్థానం దక్కింది. కానీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతలో కీలకంగా నిలిచే సింగరేణి గనులు ఉన్న తెలంగాణకు మాత్రం చోటివ్వలేదు. ఇదే లక్ష్యంతో కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఫలితం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఊరట లేదు...
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రకటనలు రాలేదు. ఉమ్మడి జిల్లాలో లక్షల సంఖ్యలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉంటారు. ప్రస్తుతం అమలవుతున్న స్లాబ్‌లను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ పెంచుతారని ఆశించినా అలా జరగలేదు. అయితే డిసెంబర్ 31 నుంచి మార్చి 31వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్‌ను 5 నుంచి 2 తగ్గించడంతో చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట లభించనుంది.
ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)లకు ఊతం ఇచ్చేలా ప్రకటన వెలువడింది. కరోనా సమయాన కుదేలైన ఈ రంగం బలోపేతానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.10వేల కోట్లతో గ్రోత్ ఫండ్‌ను ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలో 50వేలకు పైగా ఉన్న సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు కొంత మేలు జరిగే అవకాశముంది.
సమ్మాన్ నిధి పెంచలేదు...
పెట్టుబడి సాయంగా రైతులకు 2018 నుంచి కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి నగదు పెంచుతారని భావించారు. కానీ అలా జరగకపోగా కొత్తగా ఎదురుచూస్తున్న వారి విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా ఖమ్మం జిల్లాలో 1.10లక్షల మంది రైతులకు, భద్రాద్రి జిల్లాలో 75వేల మందికి ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేల చొప్పున గతంలో మాదిరిగానే సాయం అందనుంది.
‘ఉపాధి’కి పెంపు
వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు పెంచారు. ఖమ్మం జిల్లాలో 3.05లక్షల జాబ్ కార్డులు, 6.29లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.75 లక్షలకు గాను 2.88 లక్షల మంది యాక్టివ్ కూలీలు కొనసాగుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 2.23 లక్షల జాబ్ కార్డులు, 4.58 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.35 లక్షలు ఉండగా, 2.29 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. పథకానికి నిధులు పెంచినట్లు తెలుస్తుండగా, పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
పేరు లేదు.. ఊరు లేదు!
సిట్ నోటీసులు కక్ష సాధింపే..
మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
IIలో
ఇప్పటికే ప్రకటించిన రైల్వే లైన్లు పూర్తి చేసేందుకు భారీగా నిధులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే, ఏ లైన్‌కు ఎంత మొత్తంలో నిధులు ఇస్తారో తేలాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన మల్కన్‌గిరి – భద్రాచలం, మణుగూరు – రామగుండం, కొవ్వూరు – భద్రాచలం రోడ్డు, కిరండోల్ – కొత్తగూడెం లైన్లను ఏళ్ల క్రితం ప్రకటించినా రాష్ట్ర పరిధిలో ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీంతో ఈ లైన్లు పూర్తయ్యేలా నిధులు కేటాయిస్తారా, గతంలో మాదిరిగానే నామమాత్రపు నిధులతో సరిపెడతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. వీటితోపాటు డోర్నకల్ – భద్రాచలం రోడ్డు డబ్లింగ్ లైన్‌పైనా స్పష్టత రాలేదు.
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఏళ్ల నాటి కలగా కొనసాగుతోంది. కొత్తగూడెంలో ఓ స్థలాన్ని ఎంపిక చేయగా, నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించి ఇక్కడ ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. ఫలితంగా జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ స్థలాలను సైతం గుర్తించింది. కానీ కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ప్రస్తావన లేకపోవడంతో అడుగు ముందుకు పడడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర బడ్జెట్‌లో అందరితోనే మనం
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం


