క్రీడలతో స్నేహభావం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం

Feb 2 2026 7:27 AM | Updated on Feb 2 2026 7:27 AM

క్రీడలతో స్నేహభావం

క్రీడలతో స్నేహభావం

అశ్వారావుపేటరూరల్‌: బోధనేతర సిబ్బంది మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలంగాణ వ్యవసాయవిశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ చెప్పారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ మీట్‌ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఉద్యోగులంతా విశ్వ విద్యాలయం ఐక్యత, క్రీడా స్ఫూర్తి చాటారని అన్నా రు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ రిజిస్ట్రార్‌ డి. శివాజీ, కళాశాల డీన్‌ డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌, డాక్టర్‌ ఎం రాంప్రసాద్‌, యూనివర్సిటీ అబ్జర్వర్‌ డాక్టర్‌ చరిత్‌ కుమార్‌, బోధనేతర సిబ్బంది అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు ప్రదానం

క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన బోధనేతర సిబ్బందికి జిస్ట్రార్‌ బహుమతులు, జ్ఞాపికలు అందించారు. క్రీడా పోటీల్లో రాజేంద్రనగర్‌ జోన్‌, సాంస్కృతిక, సాహిత్య పోటీల్లో నార్త్‌ తెలంగాణ జోన్‌ ఓవరాల్‌ చాంపియన్లుగా నిలిచా యి. వ్యక్తిగత అథ్లెటిక్స్‌ పురుషుల విభాగంలో రాజేంద్రనగర్‌ జోన్‌నుంచి ఉదయ్‌, మహిళా విభా గంలో రాజేంద్రనగర్‌ జోన్‌ నుంచి క్రాంతిప్రియ చాంపియన్‌గా నిలిచారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం

రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement