వంద శాతం గెలుస్తాం
సంక్షేమ ఫలాలు గుర్తు చేసి
ఓటు అడగండి
వైఎస్సార్ కాలం నుంచీ
కమ్యునిస్టులు దోస్తులే
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి
కొండా సురేఖ
కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేట: ఉమ్మడిజిల్లా అంతా తిరిగి పరిశీలించానని, కాంగ్రెస్‌కు అనుకూల వా తావరణం ఉందని, మున్సిపాలిటీలను వంద శాతం గెలుస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తగూడెం డీసీసీ కార్యాలయంలో, అశ్వారావుపేటల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటింటికి అందిన సంక్షేమ ఫలాలు, ముగ్గురు మంత్రులను చేసిన అభివృద్ధిని గుర్తుచేసి ప్రజలను ఓటు అడగాలని శ్రేణులకు సూచించారు. బీ ఫామ్ ఎవరికి ఇచ్చినా మిగతా వారంతా సహకరించి గెలిపించాలన్నారు.
పొత్తుతో ముందుకు సాగితే మంచి ఫలితాలు..
ఎన్నికల్లో పొత్తుతో ముందుకు సాగితే మంచి ఫలితా లు వస్తాయని, పొత్తుల విషయంలో తాను కూడా ఇక్కడి నాయకులను ఆహ్వానిస్తున్నానని సీపీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చిన రాజకీయ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవా లని మంత్రి సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చైర్‌పర్సన్ సీట్లు మహిళలకు అధికంగా రిజర్వు అయ్యాయని అన్నారు. అశ్వారావుపేటలో సీపీఎంతో పొత్తు హర్షణీయమని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచీ కమ్యునిస్టులు మన దోస్తులని అన్నారు. కమ్యునిస్టుల దోస్తీతో అన్ని వార్డులు గెలిపించుకోవాలని సూచించారు.
సర్వేలకు అనుగుణంగానే..
సర్వేలకు అనుగుణంగానే టికెట్లు ఇస్తున్నట్లు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఎంపిక సరిగ్గా లేదనే సమాచారం తెలిస్తే మళ్లీ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. టికెట్ల కోసం డబ్బులు అడుగుతున్నారనే ప్రచారం అవాస్తవమని అన్నారు. గ్రంథా లయ చైర్మన్ వీరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, ఖమ్మంజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు, జేబి శౌరి, నా యకులు జూపల్లి రమేష్ బాబు, జూపల్లి శశికళ, తుమ్మ రాంబాబు, ఎస్‌కే ఫకీర్, సీపీఎం నాయకుడు బుడితి చిరంజీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం గెలుస్తాం


